ఫ్లైట్ టిక్కెట్స్‌లో డిస్కౌంట్ ప్రకటించిన జెట్ ఎయిర్ వేస్
- December 14, 2017
మస్కట్: ఒమన్ నుంచి వెళ్ళే ప్రయాణీకులకు జెట్ ఎయిర్వేస్ టిక్కెట్స్‌లో డిస్కౌంట్స్‌ని ప్రకటించింది. డిసెంబర్ 17, డిసెంబర్ 18 తేదీల్లో బుక్ చేసుకున్న టిక్కెట్లకు 12 శాతం డిస్కౌంట్ వర్తిస్తుంది. ఒమన్ నుంచి ఇండియా అలాగే బ్యాంకాక్, కొలంబో, ఢాక, హాంగ్‌కాంగ్, ఖాట్మండు, సింగపూర్ తదితర ప్రాంతాలకు ఈ డిస్కౌంట్స్ వర్తిస్తాయి. వన్ వే, రిటర్న్ జర్నీస్కి కూడా వర్తించేలా ఈ డిస్కౌంట్ ఆఫర్ ప్రవేశపెట్టినట్లు జెట్ ఎయిర్ వేస్ వెల్లడించింది. జనవరి 3 నుంచి మే 31 వరకు చేసే ప్రయాణాలకుగాను ఈ టిక్కెట్లు రెండ్రోజులపాటు అందుబాటులో ఉంటాయి. ఎండ్ ఆఫ్ ఇయర్ సేల్‌లో భాగంగా ఈ ఆఫర్‌ని ప్రకటించామని ప్రయాణీకులు ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించుకోవాలని జెట్ ఎయిర్ వేస్ ఒమన్ జనరల్ మేనేజర్ వాసిమ్ జైది చెప్పారు.
తాజా వార్తలు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!