దుబాయ్ సపారీ: రెండ్రోజుల్లో 14,00 మంది సందర్శకులు
- December 14, 2017
దుబాయ్ సఫారీ పార్క్ ప్రారంభమయ్యింది. కేవలం రెండ్రోజుల్లోనే 14,000 మంది సందర్శకులు దుబాయ్ సఫారీ పార్క్‌కి పోటెత్తారు. మొదటి రోజు 4,000 మంది సందర్శకులు దుబాయ్ సఫారీ పార్క్‌ని సందర్శించగా, రెండో రోజు ఏకంగా 10,000 మంది సందర్శించినట్లు అధికారులు చెప్పారు. ఫ్రీ ఎంట్రీ నేపథ్యంలో పార్క్‌కి పెద్దయెత్తున సందర్శకులు పోటెత్తుతున్నారు. పార్క్‌లో సౌకర్యాలు చాలా బాగున్నాయనీ, అత్యద్భుతమైన అనుభూతిని పార్క్ అందిస్తోందని సందర్శకులు తెలిపారు. సందర్శకులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకున్నామని దుబాయ్ మునిసిపాలిటీ డైరెక్టర్ ఆఫ్ లీజర్ ఫెసిలిటీస్ ఖాలిద్ అల్ సువైది చెప్పారు. తొలి రెండు వారాలు పార్క్ సందర్శన ఉచితం. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పార్క్ తెరిచి ఉంటుంది. అల్ వక్రా 5 డిస్ట్రిక్ట్‌లో ఈ పార్క్ ఏర్పాటయ్యింది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







