అమ్మో ఆయన చెల్లెలు.. ఆమె అంటే భయం: కరీనా

- December 14, 2017 , by Maagulf
అమ్మో ఆయన చెల్లెలు.. ఆమె అంటే భయం: కరీనా

వదిన అంటే మరదలిని భయపెట్టాలి కానీ ఇక్కడేంటి రివర్స్‌లో మరదల్ని చూసి వదిన భయపడుతోంది. అదే మరి ట్విస్ట్. ఓ మనిషికున్న విజ్ఞానఖని ముందు తమ దగ్గర బంగారు గని ఉన్నా ఉపయోగం ఉండదు. ఆ వ్యక్తిని తన విజ్ఞానం ఉన్నత శిఖరంపై కూర్చోబెడుతుంది. సంఘంలో ఓ గౌరవ స్థానాన్ని సంపాదించి పెడుతుంది. బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ కూడా భర్త సైప్ అలీఖాన్ చెల్లెలు, తనకి మరదలు అయిన సోహా అలీఖాన్ ప్రతిభాపాటవాల్ని ఎప్పుడూ కొనియాడుతూనే ఉంటుంది. 

సోహా రాసిన ' ది ఫెరిల్స్ ఆఫ్ బీయింగ్ మోడరేటరీ ఫేమస్' పుస్తకం విడుదల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కరీనా సోహా గురించి మాట్లాడుతూ చాలా తెలివైన అమ్మాయే కాకుండా అన్నింటికీ మించి మంచి అమ్మాయి అని మరదలిని ప్రశంసలతో ముంచెత్తింది. సాధారణంగా ఇంట్లో నేనెవరికీ భయపడను కానీ సోహా అంటే చాలా భయం నాకు. తను ఇంగ్లీషులో మాట్లాడుతుంటే మరీ భయం అంటోంది. సైఫ్ కూడా ఏదైనా అత్యవసర సలహా కావాలంటే చెల్లెల్నే అడుగుతారు అంటూ మరదల్ని పొగిడేసింది. ఆఖరికి భర్త కునాల్ ఖేము కూడా సోహా తెలివితేటల ముందు గులామవ్వాల్సిందే అని చెప్పుకొచ్చింది. నా తండ్రి చివరి రోజుల్లో నా కంటే ఎక్కువ సేవ చేసి ఆయన అభిమానాన్ని కూడా చూరగొంది అని అనేసరికి సోహాకి  కన్నీళ్లు ఆగలేదు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com