విరుష్క రిసెప్షన్ ఇన్విటేషన్
- December 15, 2017ఇటలీలో మ్యారేజ్ అయిపోవడంతో తర్వాత చేయబోయే పనులపై ఫోకస్ పెట్టారు విరాట్ కోహ్లి- అనుష్క శర్మ దంపతులు. ప్రస్తుతం రోమ్‌లో విహరిస్తున్న ఈ జంట.. రిసెప్షన్లను గ్రాండ్‌గా చేసేందుకు ప్లాన్ చేసింది. ఈనెల 21న ఢిల్లీలో తాజ్ డిప్లొమాటిక్ ఎంక్లేవ్‌లో బంధువులకు 26న ముంబైలో క్రికెటర్లు, బాలీవుడ్ సెలబ్రిటీలకు వివాహ విందు ఇవ్వనున్నారు. ఈ రిసెప్షన్ కోసం ఇన్విటేషన్లు ఇవ్వడం కూడా జరిగిపోయింది.
వేల రూపాయల విలువైన రిసెప్షన్ కార్డుతోపాటు అతిథులను ఆహ్వానించే సమయంలో మరో మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చింది కొత్త జంట. విందుకు ఆహ్వానిస్తూ పంపే కార్డుతోపాటు ఓ మొక్కను కూడా అందిస్తున్నారు. పర్యావరణానికి ఎటువంటి హాని చేయని పేపర్‌బ్యాగులో ఆ మొక్కని పెట్టి కార్డుతో అందిస్తున్నారు. ఈ ఆహ్వాన పత్రికను డైరెక్టర్ మహేశ్ భట్ తన ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. రీసెంట్‌గా విరాట్- అనుష్క శ్రీలంక వెళ్లినప్పుడు ఇద్దరూ కలిసి మొక్కలు నాటారు కూడా!
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల