బేబీకార్న్ తాలింపు
- December 15, 2017కావల్సినవి: బేబీకార్న్ ముక్కలు - రెండుకప్పులు, ఉల్లిపాయలు - రెండు, ఆవాలు - చెంచా, కరివేపాకు రెబ్బలు - రెండు, జీలకర్ర - చెంచా, కారం - చెంచా, ధనియాలపొడి - అరచెంచా, ఉప్పు - తగినంత, జీలకర్ర పొడి - చెంచా, కొత్తిమీర - కట్ట, సెనగపిండి, మొక్కజొన్న పిండి - పెద్ద చెంచా చొప్పున, నూనె - వేయించేందుకు సరిపడా, పసుపు - అరచెంచా.
తయారీ: బేబీకార్న్ ముక్కల్ని ఓ గిన్నెలోకి తీసుకుని అవి మునిగేవరకూ నీళ్లు పోసి పసుపు వేసి పొయ్యిమీద పెట్టాలి. అవి ఉడికాక దింపి నీళ్లు వంపేసి పెట్టుకోవాలి. ఈ ముక్కలపై తగినంత ఉప్పూ, కొద్దిగా కారం, మొక్కజొన్నపిండీ, సెనగపిండీ వేసుకుని అన్నింటినీ కలపాలి. పొయ్యిమీద బాణలి పెట్టి నూనె వేయాలి. అవి వేగాక ఈ బేబీకార్న్ ముక్కల్ని వేసి.. కరకరలాడేలా వేయించుకుని తీసుకోవాలి. మరో బాణలిలో రెండు చెంచాల నూనె వేసి దాన్ని పొయ్యిమీద పెట్టాలి. అందులో ఆవాలూ, ఉల్లిపాయముక్కలూ, కరివేపాకూ, జీలకర్ర వేయాలి. రెండు నిమిషాలయ్యాక వేయించి పెట్టుకున్న బేబీకార్న్ ముక్కలూ, మిగిలిన కారం, ధనియాలపొడీ, జీలకర్రపొడీ, కొత్తిమీర వేసుకుని బాగా వేయించి తీసుకుంటే చాలు.
తాజా వార్తలు
- ఖతార్‌లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్‌లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్‌కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!