అజ్ఞాతవాసి ఆడియోకు చిరంజీవి గైరుహాజరు..నిజంగా కారణం అదేనా
- December 16, 2017
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , త్రివిక్రమ్ కాంబినేషన్ లో సంక్రాంతి కానుకగా వస్తోన్న మూవీ అజ్ఞాతవాసి. ప్రస్థుతం రాజకీయాలతో బిజీబిజీగా వున్నా.. పవన్ కల్యాణ్ తాజాగా అజ్ఞాతవాసి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం డిసెంబర్ 19న హైదరాబాద్లో జరుగనుంది.
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఈ కార్యక్రమానికి భారీగా తరలివచ్చే అవకాశం ఉన్నందున అన్ని విధాలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పవన్ ఈవెంట్ నిర్వాహకులను హెచ్చరించినట్టు సమాచారం. గతంలో కొన్ని ఆడియో ఈవెంట్స్ సందర్భంగా చోటుచేసుకొన్న సంఘటనలను దృష్టిలో పెట్టుకొని అవసరమున్న మేరకు మాత్రమే పిలువాలని పవన్ స్పష్టం చేసినట్టు తెలిసింది. ముఖ్యంగా చిత్ర యూనిట్ సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులతోపాటు,తన అభిమానులను మాత్రమే పిలువాలని పవన్ సూచించారట. దీంతో వేడుక ప్రాంగణంలో పట్టేంతమందికే ఆహ్వానాలను పంపాలని, ప్రత్యేకమైన ఇన్విటేషన్ కార్డులను ముద్రించనున్నారట. ముఖ్యంగా ట్రాఫిక్ ఉల్లంఘనలు జరక్కుండా చూసుకోవాలని పవన్ సూచించారట.
ఇక అజ్ఞాతవాసి ఆడియోకు చిరంజీవి ముఖ్య అతిథిగా వస్తున్నట్టు ప్రచారం జరిగింది. అయితే ఈ ఫంక్షన్కు చిరంజీవి రావడం లేదని చిత్ర యూనిట్ స్పష్టం చేసింది. వ్యక్తిగత కారణాలు, ముందస్తు అపాయింట్మెంట్ లు వున్న కారణంగానే చిరంజీవి ఈ కార్యక్రమానికి రాలేకపోతున్నట్టు సమాచారం. ఇక చిరంజీవి స్థానంలో ముఖ్య అతిథిగా వెంకటేష్ వస్తున్నట్టు సమాచారం. మరోవైపు ఎన్టీఆర్ కూడా ముఖ్య అతిథిగా హాజరవుతాడని ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల