చిత్తూరు మేయర్ కటారి అనురాధ దారుణహత్య
- November 17, 2015
చిత్తూరు నగర మేయర్ కటారి అనురాధ దారుణహత్యకు గురయ్యారు. మంగళవారం ఉదయం చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని తన ఛాంబర్‌లో ఉన్న మేయర్ అనూరాధ, ఆమె భర్త మోహన్‌పై కర్ణాటకకు చెందిన ముగ్గురు దుండగులు కాల్పులు జరిపి, కత్తులతో దాడి చేశారు. రక్తపు మడుగులో పడి ఉన్న దంపతులను చిత్తూరు టూటౌన్ పోలీసులు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యంలో మేయర్ అనురాధ మృతి చెందారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మోహన్‌ను తమిళనాడులోని వేలూరు సీఎంసీకి తరలించారు.మేయర్ హత్య ఘటనతో చిత్తూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.ముసుగులు ధరించి నగర పాలక సంస్థ కార్యాలయంలోకి దౌర్జన్యంగా చొరబడిన ముగ్గురు దుండగులు మేయర్, ఆమె భర్త మోహన్‌పై కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు.మేయర్ అనురాధ, అమె భర్త మోహన్‌ను దుండగులు పాయింట్ బ్లాంక్‌లో కాల్చి, కత్తులతో దాడి చేశారు.ఘటన అనంతరం దుండగులు కార్యాలయం గేటు దూకి పరారైనట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ దాడి పథకం ప్రకారమే జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.చిత్తూరు మేయర్ అనురాధ హత్యకు గురయ్యారన్న సమాచారం అందుకున్న వెంటనే ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి చినరాజప్ప, మరో మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి హుటాహుటినచిత్తూరు బయలుదేరారు.చిత్తూరు నగర మేయర్ కటారి అనురాధ హత్యకేసులో నిందితులుగా అనుమానిస్తున్న ఇద్దరు చిత్తూరు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయినట్లు సమాచారం. నిందితులు లొంగిపోయిన విషయాన్ని ధ్రువీకరించేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు.అనురాధ హత్యకేసులో నిందితుల కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఘటన అనంతరం ఇద్దరు దుండగులు చిత్తూరు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయినట్లు సమాచారం. మిగిలిన నిందితుల కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. కాల్పులకు తెగబడిన దుండగులు కర్ణాటకకు చెందిన వారిగా అనుమానిస్తున్నారు. దీంతో చిత్తూరు-కర్ణాటక సరహద్దులో తనిఖీలు ముమ్మరం చేశారు. దాడిలో పాల్గొన్నది ఎందరనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. తొలుత ముగ్గురు నిందితులు ముసుగు ధరించి కార్యాలయంలోకి వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఘటనలో మొత్తం ఆరుగురు నిందితులు పాల్గొన్నట్లు మరి కొందరు చెబుతున్నారు.
తాజా వార్తలు
- అల్ వుస్తా, సౌత్ అల్ షర్కియా గవర్నరేట్లలో సుల్తాన్ పర్యటన..!!
- ఖతార్‌లో ఇంటర్నేషనల్ స్పేస్ వీక్ 2026..!!
- బహ్రెయిన్‌లో అక్టోబర్ 9న ‘ట్రిబ్యూట్ టు బహ్రెయిన్’..!!
- కువైట్‌లో 77 సంస్థలకు ఫైర్ సేఫ్టీ హెచ్చరికలు..!!
- దుబాయ్ డ్యూటీ ఫ్రీలో $1 మిలియన్ గెలిచిన భారతీయుడు..!!
- GCC-ASEAN మధ్య ఆర్థిక, వాణిజ్య సహకార విస్తరణపై చర్చలు..!!
- భారీ వర్షాలు..అధికారులను అప్రమత్తం చేసిన సీఎం చంద్రబాబు!
- హైదరాబాద్ విమానాశ్రయం–బ్రస్సెల్స్ విమానాశ్రయం మధ్య అవగాహన ఒప్పందం
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో వైట్ కోట్ సెరిమనీ
- ఉత్తరాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాలు.. పలు విమానాల దారి మళ్లింపు







