డిసెంబర్ 22న విడుదల కానున్న సందేశాత్మక చిత్రం 'రంగీలా'
- December 16, 2017
శ్రీ తిరుమల సినిమాస్ పతాకంపై బాదంగీర్ సాయి, ఆర్‌కే గురు ఎంటర్ టైన్‌మెంట్స్ సంయుక్త సమర్పణలో రాకేష్ రెడ్డి దర్శకత్వంలో ప్రతాప్ కుమార్ దండెం నిర్మిస్తున్న చిత్రం 'రంగీలా' (రంజిత, గీత, లాస్య). రేఖాబోజ్, నిధిసింగ్, నవ్యారాజ్, వీరేష్ బాబు, ప్రితమ్ రెడ్డి, వివేక్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో `ఐడ్రీమ్`టియన్ఆర్ ఓ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రం అన్ని కార్య క్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 22న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా దర్శకుడు రాకేష్ రెడ్డి మాట్లాడుతూ..."గతంలో నేను 'కాలాయతస్మైనమః;' అనే ఓ ప్రయోగాత్మక చిత్రం చేశాను. దానికి మంచి పేరు వచ్చింది. తాజాగా ముగ్గురు అమ్మాయిలు ప్రధాన పాత్రల్లో కాంటెంపరరీ అంశాలతో క్యూట్ లవ్ స్టోరీ గా'రంగీలా' చిత్రాన్ని తెరకెక్కించాము. కథ విషయానికొస్తే...పట్నం మోజులో పడి యువత తమ జీవితాన్ని ఎలా పాడు చేసుకుంటోంది? షార్ట్ కట్ లో సంపాదించాలనే తొందరలో చివరకు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు? అమ్మాయిలపై జరుగుతున్న దాడులను ఎలా ఎదుర్కోవాలి అనేది మా చిత్రంలో చూపించాము. ఇందులో సందేశంతో పాటు ఆడియన్స్ కు కావాల్సిన కమర్షియల్ హంగులన్నీ పొందుపరిచాము. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా తెరకెక్కించడానికి మా నిర్మాతలు అన్ని విధాలుగా సహకరించారు. మా టీమ్ అంతా ఎంతో సహకరించారు. షూటింగ్ మొత్తం వైజాగ్ లో చేశాము. నటీనటులు కొత్తవారైనప్పటికీ ఎంతో అనుభవం ఉన్నవారిలా నటించారు. ముఖ్యంగా `ఐడ్రీమ్` టియన్ఆర్ గారు మా సినిమాలో ఒక ఇంపార్టెంట్ పాత్రలో నటించారు. సెన్సార్ సభ్యులు కూడా సినిమా చాలా బావుందంటూ ప్రశంసించడం మా సినిమాకు దక్కిన మొదటి విజయంలా భావిస్తున్నాం. ఈ నెల 22న గ్రాండ్ గా సినిమా విడుదల చేస్తున్నాం" అన్నారు.
తాజా వార్తలు
- త్వరలో వెబ్లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!







