భారీగా పెరిగిన తిరుపతి లడ్డు ధరలు

- December 16, 2017 , by Maagulf
భారీగా పెరిగిన తిరుపతి లడ్డు ధరలు

శ్రీవారి మహా ప్రసాదమైన లడ్డూని భక్తులు పరమ పవిత్రంగా భావిస్తారు. వెంకన్న దర్శనం చేసుకుని లడ్డూ ప్రసాదాన్ని తీసుకునే తిరిగి వెళ్తారు.. భక్తుల కోసం నిత్యం మూడు లక్షలకుపైగా లడ్డూలను టీటీడీ తయారు చేస్తోంది. ప్రస్తుతం మార్కెట్‌ ధరల ప్రకారం ఒక్కో లడ్డూ తయారీకి 30 రూపాయల వరకు ఖర్చవుతోంది.. అయితే దర్శనానికి వచ్చే భక్తులకు ఉచితంగానే అందజేస్తున్న అధికారులు.. అదనపు లడ్డూలకు మాత్రం 25 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇకపై వీటి రేట్లను పెంచాలనే నిర్ణయానికొచ్చింది టీటీడీ. ఇప్పటికే ధార్మిక కార్యక్రమాలకు సరఫరా చేసే ప్రసాదం ధరలను పెంచగా.. సిఫార్సు లడ్డూల రేట్లను కూడా ఈనెల 25 నుంచి పెంచనుంది.100 రూపాయలున్న కల్యాణోత్సవ లడ్డూ ధరని రెట్టింపు చేశారు. సాధారణ లడ్డూని 50 రూపాయలు చేశారు. వడ ప్రసాదాన్ని కూడా 100 రూపాయలుగా నిర్ణయించారు. పెరిగిన ధరలు ఈనెల 25 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే ఈ పెంపు ఇక్కడి వరకు ఆగిపోదనే అనుమానం కలుగుతోంది. చివరి దశలో సామాన్య భక్తులకు కేటాయించే లడ్డూ ధరలను కూడా పెంచవచ్చనే ప్రచారం జరుగుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com