శ్రీ లంకపై 2-1తో భారత్‌ సిరీస్‌ కైవసం

- December 17, 2017 , by Maagulf
శ్రీ లంకపై 2-1తో భారత్‌ సిరీస్‌ కైవసం

విశాఖ పట్నం: శ్రీలంకతో జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత్‌ అదరగొట్టింది. పర్యాటక జట్టుపై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ (100 నాటౌట్‌; 85 బంతుల్లో 13×4, 2×6) శతకంతో, శ్రేయస్‌ అయ్యర్‌ (65; 63 బంతుల్లో 8×4, 1×6) అర్ధశతకంతో చెలరేగడంతో లంక నిర్దేశించిన 216 పరుగుల లక్ష్యం ఏ మూలకూ చాలలేదు. భారత్‌ 32.1 ఓవర్లకే ఆటను ముగించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా 2-1 తేడాతో గెలుచుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com