ఇండియానాలో కూలిన విమానం, ముగ్గురు మృతి
- December 17, 2017
విమాన ప్రమాదంలో ముగ్గురు మృతిచెందిన సంఘటన అమెరికాలోని ఇండియానా రాష్ట్రం మిడ్‌వెస్ర్టన్‌లో జరిగింది. విమానం మిస్సౌరీలోని కాన్సాన్ నగరం నుంచి మేరీలాండ్‌లోని ఫ్రెడరిక్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈఘటనలో ముగ్గురు వ్యక్తులతో పాటు ఓ శునకం కూడా చనిపోయింది. మరో శునకం అదృష్టవశాత్తూ గాయాలతో బయటపడింది.
ఆ శునకాన్ని పోలీసు అధికారులు దగ్గరలోని వెటర్నరీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల వివరాలను పోలీసు అధికారులు ఇంకా వెల్లడించలేదు. ప్రమాదానికి గురైన విమానానికి ఒక ఇంజిన్ మాత్రమే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్







