ముంబయిలో ఘోర అగ్నిప్రమాదం, 12 మంది సజీవదహనం
- December 17, 2017
మహారాష్ట్ర రాజధాని ముంబయిలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఖైరానీ రోడ్డులోని ఓ దుకాణంలో సోమవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 12 మంది మృతిచెందగా.. పలువురు గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయకచర్యలు చేపట్టారు. అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..







