ఐటీ హబ్ నిర్మాణ పనులను పరిశీలించిన ఎంపీ కవిత

- December 18, 2017 , by Maagulf
ఐటీ హబ్ నిర్మాణ పనులను పరిశీలించిన ఎంపీ కవిత

ఖమ్మం: తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగం లేకుండా చేస్తామని నిజామాబాద్ ఎంపీ కవిత స్ఫష్టం చేశారు. సోమవారం ఆమె ఖమ్మంలో ఐటీ హబ్ నిర్మాణ పనులను పరిశీలించారు. దీనితో పాటు ఆమె నగరంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్థానిక యువత ఉద్యోగాల కోసం వలస పోవాల్సిన అవసరం లేదని అన్నారు. ఐటీ హబ్ పూర్తయితే ఖమ్మంలోనే ఉపాధి దొరుకుతుందని అన్నారు. ఖమ్మంతో పాటు మరో మూడు జిల్లాల్లో ఐటీ హబ్‌లు నిర్మిస్తామని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com