నీరు-ప్రగతి, వ్యవసాయం పురోగతిపై ఏపీ సీఎస్ టెలికాన్ఫరెన్స్

- December 18, 2017 , by Maagulf
నీరు-ప్రగతి, వ్యవసాయం పురోగతిపై ఏపీ సీఎస్ టెలికాన్ఫరెన్స్

అమరావతి: నీరు-ప్రగతి, వ్యవసాయం పురోగతిపై ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పలు జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దినేష్ కుమార్ అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ముఖ్యంగా రబీ సీజన్ పంటరుణాలు వెంటనే పంపిణీ చేయాలి,లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. కర్నూలు, విజయనగరం, అనంతపురం, నెల్లూరు జిల్లాలలో పంటరుణాల పంపిణీ వేగవంతం చేయాలని సూచించారు. బ్యాంకర్లతో జిల్లా కలెక్టర్లు సమన్వయం చేసుకోవాలి, కౌలు రైతుల రుణపంపిణీ లక్ష్యాన్ని చేరాలని పేర్కొన్నారు. ప్రకాశం, విజయనగరం, కర్నూలు జిల్లాలలో మైక్రో న్యూట్రియంట్స్ పంపిణీ మందకొడిగా ఉందని వేగవంతం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. 

టెలికాన్ఫరెన్స్ ముఖ్యాంశాలు.. దినేష్ మాటల్లోనే..

జిల్లాలలో ఎంపిఈవోల నియామకం వెంటనే భర్తీచేయాలి. డిసెంబర్ 31నుంచి జనవరి 9వరకు గుంటూరులో జరిగే పాలేకర్ శిక్షణా కార్యక్రమం విజయవంతం చేయాలి. రైతు రుణ ఉపశమనంకు సంబంధించిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి. కర్నూలు,నెల్లూరు,చిత్తూరు జిల్లాలలో లేబర్ కాంపోనెంట్ వినియోగంపై దృష్టిపెట్టాలి. పంట సంజీవని, వర్మికం పోస్ట్ పనులు త్వరితగతిన పూర్తిచేయాలి. నరేగా మార్గదర్శకాలు తూచా తప్పకుండా పాటించాలి. 7 రిజిస్టర్లు సక్రమంగా అప్ డేట్ చేయాలి. నరేగా పనులను పరిశీలించడానికి కేంద్ర బృందాలు కృష్ణా, గుంటూరులో పర్యటిస్తున్నాయి. ఇప్పటివరకు అన్ని పథకాల కింద 1,95,927ఇళ్ల నిర్మాణం పూర్తయ్యింది అని దినేష్ పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com