పారిస్ మేయర్ని కలిసిన కతార్ ప్రధాన మంత్రి

- November 17, 2015 , by Maagulf
పారిస్ మేయర్ని కలిసిన కతార్ ప్రధాన మంత్రి

కతార్ ప్రధాన మంత్రి మరియు అంతరంగిక శాఖా మంత్రి - హిజ్ హైనెస్ షేక్ అబ్దుల్లా బిన్ నస్సేర్ బిన్ ఖలీఫా అల్ థాని, పారిస్ మేయర్ అన్నే హిడాల్గోను కలిసారు. ఈ సమావేశంలో, ద్వైపాక్షిక సహకారం మరియు దానిని అభివృద్ధి చేసే విధానాలను గూర్చి చర్చించారు. ఫ్రెంచ్  నేషనల్  జెండేర్మరి డైరక్టర్  జనరల్ - డెనిస్ ఫెవియర్ ను కూడా ఆయన కలిసారు.  కతార్ రాయబార కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో - ముఖ్యంగా భద్రతా సంబంధమైన పరస్పర విషయాలు, వానిని పెంపొందించే విధానాలను గూర్చి చర్చించారు. కాగా నేడు కతార్ ప్రధాని, ఫ్రాన్స్ అధ్యక్షులు ఫ్రంకొఇస్ హాలండ్ మరియు ప్రధాని మన్యుఅల్ వాల్ల్స్ తో నేడు సంప్రదింపులు జరుపుతారు.   కాగా ప్రధాని, ఇటీవల పారిస్ దాడిని జరిగిన తీవ్రంగా ఖండిస్తూ, తీవ్రవాదాన్ని కలసికట్టుగా తరిమి కొట్టడంలో ఫ్రాన్స్ ప్రభుత్వానికి తమ పూర్తి మద్దతును ప్రకటించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com