జపాన్ లో డిసెంబర్ 29న అడుగు పెట్టనున్న బాహుబలి 2

- December 19, 2017 , by Maagulf
జపాన్ లో డిసెంబర్ 29న అడుగు పెట్టనున్న బాహుబలి 2

దర్శక ధీరుడు జక్కన్న రాజమౌళి చెక్కిన వెండి తెర శిల్పం.. బాహుబలి.. ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజై ప్రేక్షకుల అదరణ పొందాయి. బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ ను క్రియేట్ చేసిన బాహుబలి 2 సినిమా తాజాగా జపాన్ లో అడుగు పెట్టబోతున్నది. కట్టప్ప బహుబలిని ఎందుకు చంపాడు అన్న ప్రశ్నకు సమాధానం కోసం యావత్ ప్రపంచం ఎదురు చూసింది.. రిలీజైన కొన్ని భాషల్లో ఆ ప్రశ్నకు సమాధానం దొరికింది.. మరి ఎక్కడైనా ఫంక్షన్ లో రాజమౌళి ఎదుర్కొనే ఈ ప్రశ్నకు సమాధానం జపాన్ లో దొరకనున్నది. బాహుబలి 2 ని డిసెంబర్ 29న జపాన్ లో రిలీజ్ చేయనున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com