రైల్వేస్టేషన్‌పై దాడి, అధికారుల కిడ్నాప్‌.!

- December 19, 2017 , by Maagulf
రైల్వేస్టేషన్‌పై దాడి, అధికారుల కిడ్నాప్‌.!

బిహార్‌లో నక్సలైట్లు రెచ్చిపోయారు. అర్ధరాత్రి ఓ రైల్వేస్టేషన్‌పై దాడి చేసి.. అక్కడి అధికారులను కిడ్నాప్‌ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో జమల్‌పూర్‌ జిల్లాలోని మసుదాన్‌ రైల్వేస్టేషన్‌పై కొందరు నక్సలైట్లు దాడి చేశారు. అక్కడి కమ్యూనికేషన్‌ గదికి నిప్పంటించారు. అనంతరం అసిస్టెంట్‌ స్టేషన్‌ మాస్టర్‌, మరో అధికారిని కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లారు. సమాచారమందుకున్న రైల్వే పోలీసులు, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కాగా.. కిడ్నాప్‌కు గురైన అసిస్టెంట్‌ స్టేషన్‌ మాస్టర్‌ నుంచి మాల్దా డీఆర్‌ఎంకు ఫోన్‌ వచ్చినట్లు స్థానిక మీడియా వర్గాల సమాచారం. మసుదాన్‌ ట్రాక్‌పై రైలు రాకపోకలు చేపడితే తమను చంపేస్తామని నక్సలైట్లు బెదిరించినట్లు అసిస్టెంట్‌ స్టేషన్‌ మాస్టర్‌ చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో అధికారులు ఆ మార్గాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ప్రయాణికులకు సూచించారు. ఈ ఫోన్‌కాల్‌పై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com