ఒమాన్ లో మెగా హీరోకి షాక్.!
- December 19, 2017
ఈ మధ్య కాలంలో తెలుగు సినిమా మార్కెట్ విస్తృతంగా పెరిగింది. విదేశాలలో కూడా మన సినిమాలు బాక్సాఫీస్ రికార్డులు కొల్లగొడుతున్నాయి. టాలీవుడ్ హీరోలకి అక్కడ కూడా భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, బాలయ్య వంటి హీరోలని విదేశీ ప్రజలు ఎంతగానో ఆరాధిస్తుంటారు. అయితే తాజాగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్‌కి మస్కట్‌లో లభించిన ఆదరణ అతనిని షాక్‌లో పడేసింది. తేజూ ప్రస్తుతం వివి వినాయక్ దర్వకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి ఇందులో కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమా పాటలు , రెండు యాక్షన్ ఎపిసోడ్స్ కోసం చిత్ర యూనిట్ ఒమన్ దేశానికి పయనమయ్యారు . మస్కట్ సిటీ విమానాశ్రయంలో దిగగానే తేజూకి చిరు అభిమానుల నుండి సాదర స్వాగతం లభించింది. మెగా మేనల్లుడు వస్తున్నాడని తెలుసుకున్న మెగా ఫ్యాన్స్ పెద్ద దండలతో ఎదురొచ్చి , వారికి పుష్పగుచ్చాలు ఇచ్చి స్వాగతం పలికారు. వేరే దేశంలో తమకి లభించిన ఈ ఆదరణకి చిత్ర యూనిట్ తెగ సంతోషపడిపోయిందని తెలుస్తుంది. గతంలో ఈ చిత్రానికి ఇంటిలిజెంట్, దుర్గ అనే టైటిల్ పరిశీలిస్తున్నారని వార్తలు రాగా, తాజాగా ధర్మా బాయ్ అంటూ ప్రచారం జరుగుతుంది. ఈ టైటిల్‌ని బట్టి చూస్తుంటే ఇదొక పక్కా మాస్, యాక్షన్ మూవీ అని అర్ధమవుతుంది. ఈ కార్యక్రమం శ్రీ చందక రాందాస్ (మెగా ఫాన్స్ ప్రెసిడెంట్) గారి ఆధ్వర్యం లో జరిగింది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







