పాక్ జైళ్లలో మగ్గుతున్న 500 పైగా భారతీయలు
- December 19, 2017
పాకిస్థాన్ జైళ్లలో దాదాపు 500 మందికి పైగా భారతీయ ఖైదీలు ఉన్నట్లు తాజా నివేదిక ద్వారా వెల్లడైంది. పాక్‌లోని వివిధ జైళ్లలో ఎంతమంది విదేశీ ఖైదీలు ఉన్నారనే దానికి సంబంధించిన నివేదికను ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం.. మొత్తం 996 మంది విదేశీయులు పాక్ జైళ్లలో మగ్గుతుండగా.. వారిలో 527 మంది భారతీయులు ఉన్నారు. ఉగ్రవాదం, హత్య, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, అక్రమంగా ఆ దేశంలోకి చొరబడటం వంటి నేరాలు చేసిన వాళ్లే ఎక్కువ మంది ఉన్నట్లు ఆ దేశ అధికారులు తెలిపారు. పాక్ జైళ్లలో ఉన్న భారతీయుల్లో ఎక్కువ మంది మత్స్యకారులు ఉన్నారు. పాక్ జలాల్లోకి అక్రమంగా ప్రవేశించి చేపల వేట చేస్తున్న జాలర్లను ఎక్కువగా పట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు. గత నెల 55 మంది భారతీయ జాలర్లను పాక్ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మిగతా విదేశీ ఖైదీల్లో సౌదీ, చైనాకు చెందిన వాళ్లు ఉన్నారు. పాక్ దేశానికి చెందిన దాదాపు 9,476మంది 100 దేశాల్లోని జైళ్లలో ఖైదీలుగా ఉన్నట్లు విదేశాంగశాఖ అధికారి లాహోర్ న్యాయస్థానానికి తెలియజేశారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల