త్వరలో అణు ఒప్పందంపై అమెరికాతో చర్చలు
- December 21, 2017
తమ దేశంలో పౌరఅణువిద్యుత్ తయారీలో అమెరికా సంస్థల భాగస్వామ్యంపై త్వరలోనే చర్చలు ప్రారంభం కాగలవని ఆశిస్తున్నట్లు సౌదీ అరేబియా తెలిపింది. అన్నీ సజావుగా జరిగితే 2018 ఆరంభంలోనే అణువిద్యుత్ తయారీకోసం తొలి టెండర్‌ను జారీ చేస్తామని సౌదీ విద్యుత్ శాఖ మంత్రి ఖలీద్ అల్ ఫలి ఒక మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అణు విద్యుత్ ఉత్పాదన ద్వారా ఇంథన చమురువృధాను అరికట్టి ఎగుమతులను పెంచుకునేందుకు అవకాశం వుంటుందని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. సౌదీ అరేబియా దేశవ్యాప్తంగా అణువిద్యుత్ ఉత్పాదక కేంద్రాలను ఏర్పాటుచేసేందుకు అమెరికన్ సంస్థలను ఆహ్వానిస్తున్నామని ఆయన చెప్పారు. రానున్న కొన్ని వారాల్లో ఈ క్రమం వేగం పుంజుకుంటాయని తాము భావిస్తున్నామని, అమెరికా చట్ట నిబంధనల మేరకు ఆయా సంస్థలు తమ దేశంలో అణువిద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు అక్కడి ప్రభుత్వం అంగీకరించగలదని ఆశిస్తున్నామని ఆయన చెప్పారు. అణుకార్యక్రమాలను శాంతియుత ప్రయోజనాలకు తప్ప ఆయుధ ఉత్పాదనకు వినియోగించరాదంటూ తమతో అణు ఒప్పందం కుదుర్చుకునేందుకు ఆసక్తి చూపే దేశాలకు అమెరికా షరతులు విధించే విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల