డాక్టర్ అయ్యి.. నటనతో.. డ్యాన్స్ తో 'ఫిదా' చేస్తోన్న భానుమతి
- December 24, 2017
ప్రేమమ్ సినిమాతో మల్లర్ గా మలయాళీలను మెస్మరైజ్ చేసి.. భానుమతిగా తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన భామ సాయి పల్లవి. తాజాగా మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేయడానికి వచ్చిన ఈ భామ.. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ఆసక్తి కరమైన విషయాలను పంచుకొన్నది. వివరాల్లోకి వెళ్తే..
సాయి పల్లవి హీరోయిన్ కంటే ముందు ఢీ షో లో విన్నర్.. తనకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే చాలా చాలా ఇష్టం అని అందుకే డ్యాన్స్ షో లో పోటీ చేసేదానిని అని చెప్పింది. అలా డ్యాన్స్ చేస్తూ.. ఓ సారి ప్రభుదేవాతో డ్యాన్స్ షో చేశా.. కానీ మా నాన్న మాత్రం నీకు చదువు ముఖ్యం.. చదువు తర్వాతే అన్నీ చెప్పేవారు.. తనకు నటన పట్ల పెరుగుతున్న ఆసక్తిని చూసిన నాన్న... సినిమాలు వద్దు... చదువే ముద్దు అని పదే పదే చెప్పేవారు .. ఇక్కడ ఉంటే ఎక్కడ సినిమాల్లోకి వెళ్లిపోతానేమో అని భయపడిన నాన్న.. తాను జార్జియాలో మెడిసిన్ లో జాయిన్ చేశారు అని సాయి పల్లవి చెప్పింది.. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అబ్బాయిలకే కాదు.. అమ్మాయిలకు కూడా ఉంటుంది అని చెప్పి.. తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకొన్న ఈ పిల్ల తెలుగు భాషలో డైలాగ్స్ చెప్పి తెలుగు వారి హృదయలను కొల్లగొట్టింది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







