మోడీకి ఎయిమ్స్ వైద్యుల లేఖ
- December 24, 2017
జయపుర: జీతాలు పెంచాలంటూ కొద్దిరోజులుగా రాజస్థాన్‌కి చెందిన ప్రభుత్వ వైద్యులు ఆందోళన చేపడుతున్నారు. దీనిపై ఎయిమ్స్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు హర్జీత్ సింగ్ ప్రధాని నరేంద్రమోడికి లేఖ రాశారు.
మీలాంటి ప్రధాని మాకు ఉన్నందుకు మేమెంతో అదృష్టవంతులం. ఓ ప్రభుత్వ వైద్యుడి బాధలు మీకు తెలియాలంటే తెలుపు రంగు ఆప్రాన్ వేసుకుని ఒకరోజు ప్రభుత్వ వైద్యుడిగా వ్యవహరించండి. అప్పుడు మీకు తెలుస్తుంది అత్యవసర పరిస్థితుల్లో రోగుల కుటుంబీకులు మాతో ఎలా ప్రవర్తిస్తారో. ప్రచారం కోసం ఇలాంటి ఆందోళనలు చేస్తున్నామని ఆరోపించే మంత్రులకు కూడా మా బాధలేంటో తెలిసొస్తాయి. మీరు ఒక్కరోజు ప్రభుత్వ వైద్యుడిగా మారితే విద్యావ్యవస్థలో మార్పు, ప్రజలకు నమ్మకం కలుగుతుంది అని లేఖలో పేర్కొన్నారు.
జీతాలు పెంచాలంటూ రాజస్థాన్‌లో వైద్యులు డిసెంబర్ 16 నుంచి ఆందోళన కొనసాగిస్తున్నారు. ఆందోళనలు చేస్తున్న వైద్యులపై ప్రభుత్వం రెస్మా చట్టం ప్రయోగించి 86 మంది వైద్యులను అరెస్టు చేయించిందని లేఖలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల