ట్రాఫిక్ ఉల్లంఘనలపై రిపోర్ట్ చేసే సమయంలో రియాద్ విలేఖరికి తప్పని ట్రాఫిక్ ఉల్లంఘనల టిక్కెట్

- December 24, 2017 , by Maagulf
ట్రాఫిక్ ఉల్లంఘనలపై రిపోర్ట్ చేసే సమయంలో రియాద్ విలేఖరికి తప్పని  ట్రాఫిక్ ఉల్లంఘనల టిక్కెట్

జెడ్డా: " శకునం చెప్పే బల్లి ...కుడితిలో పడిందన్నట్లు " పొద్దున లేస్తే సుద్దులు చెప్పే ఓ పాత్రికేయుడు   తానూ ట్రాఫిక్ నియమ నిబంధనలకు అతీతుడిని కాదని ఈ వార్త రుజువు చేసింది.  విధి నిర్వహణలో  రిపోర్టర్స్ సంఘటన స్థలంలో నుంచి ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. కధనం ఇద్దామనుకొన్న ఒక సౌదీ ఆధారిత పాత్రికేయుడు ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడి తనకు తానె ఇరుకున పడి అందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సివచ్చింది. నగరంలో పెద్ద సంఖ్యలో ఏర్పడుతున్న ట్రాఫిక్ ఉల్లంఘనల గూర్చి నివేదించడానికి రియాద్ లోని అత్యంత రద్దీగా ఉండే  రోడ్లు పై నుంచొని  ఆల్-ఎఖ్బరియా టీవీ తరుపున 'అల్లా యిటిక్ ఖీరా'  అనే వ్యంగ కార్యక్రమంలో యూసఫ్ అల్-జర్ అబ్దుల్లా అనే విలేఖరి ప్రత్యక్ష ప్రసారంలో పాల్గొంటున్నాడు.. గుక్క తిప్పుకోకుండా ట్రాఫిక్ ఇక్కట్లు గూర్చి  మైకులో తానూ పనిచేసే న్యూస్ సెంటర్ కు నివేధిస్తున్నాడు. వాహనదారులు అసలు అక్రమంగా ఎందుకు పార్క్ చేస్తారో ..వారు మిగిలినవారికి ఎంత ఇక్కట్లు కల్గిస్తారో అంటూ మాట్లాడుతూ, ఉండగా తన వాహనం సైతం   తప్పుగా పార్కింగ్  చేయడం అందుకు బదులుగా ట్రాఫిక్ అధికారులు జరిమానా చెల్లించాలంటూ టికెట్ ఇచ్చారని తెలుసుకోవడానికి ఆశ్చర్యపోయాడు. కార్యక్రమం మధ్యలో ఒక ట్రాఫిక్ పోలీస్ మధ్యలో వచ్చి ట్రాఫిక్  ఉల్లంఘనపై వివరణ అడుగుతూ ఉన్న వీడియో సైతం ప్రసారం కాబడింది.    ఉన్న ఒక క్లిప్ అబ్దుల్లా తన నివేదిక ముగింపులో ట్రాఫిక్ కాప్తో మాట్లాడటం చూపించాడు.ఇలా అతిక్రమించడానికి వాస్తవంగా తాము ఆతురుతలో ఉన్నారని లేదా తగిన పార్కింగ్ స్థలాన్ని కనుగొనలేకపోవడమేనని ధ్రువీకరించారు. 'అల్లా యిటిక్ ఖీరా'  లో శుక్రవారాలు మరియు రహదారి భద్రత గురించి అవగాహనను ప్రజలకు నివేధిస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com