కొనసాగుతున్న భారత స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ జైత్రయాత్ర...!!
- December 24, 2017
ప్రొఫెషనల్ బాక్సింగ్‌లో భారత స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ జైత్రయాత్ర కొనసాగింది. ప్రొ కెరీర్లో అజేయ రికార్డును నిలబెట్టుకుంటూ తన పదో బౌట్లోనూ సంచలన విజయం సాధించాడు. పదో బౌట్లో ఆఫ్రికా ఛాంపియన్ ఎర్నెస్ట్ అముజుతో పోరులో విజేందర్ ఇంకాస్త చెలరేగిపోయాడు. విజేందర్ పంచ్‌లకు ప్రత్యర్థి దగ్గర సమాధానం లేకపోవడంతో.. రిఫరీలు ఏకగ్రీవంగా జేతగా ప్రకటించారు. ఈ విజయంతో విజేందర్కు డబ్ల్యూబీఓ ఒరియెంటల్, ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్ వెయిట్ టైటిళ్లు దక్కాయి.
సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగిన బౌట్లో ఆరంభంలో విజేందర్ కాస్త తడబడినట్టు కనిపించాడు. కానీ ఒక్కసారి లైన్లో పడ్డ తరువాత వెనుతిరిగి చూడలేదు. పంచ్‌లపై పంచ్‌లు విసురుతూ ప్రత్యర్థిని కోలుకోనీయకుండా చేశాడు. అంతకుముదు విజేందర్‌ను నాకౌట్ చేస్తా.. అతడిని గాయాలతో రింగ్ నుంచి పంపిస్తా అంటూ ప్రకటనలు చేసిన అముజు.. బౌట్ ముందుకు సాగేకొద్దీ భారత స్టార్ ముందు నిలవలేకపోయాడు. అముజు పక్కటెముకలపై బలమైన పిడిగుద్దులు కురిపించిన విజేందర్.. అతడిని కోలుకోనివ్వకుండా చేశాడు.
విజేందర్ గెలిచిన 10 బౌట్లలో ఏడు నాకౌట్లు కాగా.. మిగతా మూడు బౌట్లను పూర్తిగా ఆడి విజయం సాధించాడు. ప్రొఫెషనల్ బాక్సింగ్‌లో అడుగు పెట్టినప్పటి నుంచి ఓటమి ఎరుగకుండా దూసుకెళ్తున్నాడు..
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







