అల్‌ వాహ్దా మాల్‌లో క్రిస్‌మస్‌ వేడుకలు

- December 24, 2017 , by Maagulf
అల్‌ వాహ్దా మాల్‌లో క్రిస్‌మస్‌ వేడుకలు

అల్‌ వాహ్దా మాల్‌లో క్రిస్‌మస్‌ సందర్భంగా పలు ఈవెంట్స్‌ నిర్వహిస్తున్నారు. శాంటా క్లాజ్‌ని ఏర్పాటు చేయడం, ఎల్ఫ్స్‌ వంటి ఆకర్షణలున్నాయిక్కడ. ఫెస్టివ్‌ పెరేడ్‌, వింటర్‌ సినిమా, స్టోరీ టెల్లింగ్‌, గేమ్‌ ఆర్గనైజింగ్‌, ఫేస్‌ పెయింటింగ్‌ వంటి ఆకర్షణలతో సందర్శకుల్ని ఆకట్టుకునేందుకు ఏర్పాట్లు చేశారు. 200 అరబ్‌ ఎమిరేట్స్‌ దినార్స్‌ విలువైన షాపింగ్‌ చేయడం లేదా సింగిల్‌ ట్రాన్జాక్షన్‌లో లులు హైపర్‌ మార్కెట్‌లో 500 అరబ్‌ ఎమిరేట్‌ దినార్స్‌ షాపింగ్‌ చేస్తే, ఇద్దరు విన్నర్స్‌ 25,000 అరబ్‌ ఎమిరేట్స్‌ దినార్స్‌ విలువైన షాపింగ్‌ వోచర్స్‌ని గెలుచుకునే అవకాశం పొందవచ్చు. అల్‌ వాహ్దా మాల్‌ జనరల్‌ మేనేజర్‌ నౌమన్‌ ఠాకూర్‌ మాట్లాడుతూ, క్రిస్‌మస్‌, న్యూ ఇయర్‌ సందర్భంగా మాల్‌లో ఎంటర్‌టైనింగ్‌ కార్యక్రమాలు చేపడుతున్నామని, పండుగల వేళ వినియోగదారుల్ని సెలబ్రేషన్‌లో ముంచెత్తడమే తమ ఉద్దేశ్యమని చెప్పారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com