రాహుల్‌గాంధీ యూఏఈ పర్యటన వాయిదా

- December 24, 2017 , by Maagulf
రాహుల్‌గాంధీ యూఏఈ పర్యటన వాయిదా

దుబాయ్‌: జనవరి 9న యూఏఈలో ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పర్యటించాల్సి ఉండగా, ఆ పర్యటన వాయిదా పడింది. కొన్ని ప్రత్యేక కారణాలతో వాయిదాపడ్డ ఈ పర్యటన, తిరిగి ఎప్పుడు చేపట్టేదీ త్వరలో తేలనున్నట్లు ఇన్‌కాస్‌ యూఏఈ కమ్యూనిటీ జనరల్‌ సెక్రెటరీ పున్నక్కన్‌ మొహమ్మద్‌ అలి చెప్పారు. ఇన్‌కాస్‌ ప్రెసిడెంట్‌ మహాదేవన్‌, అలీ ఓ ప్రకటన విడుదల చేశారు. జనవరి 9 పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నామనీ, ఇంతలోనే రాహుల్‌ టూర్‌ వాయిదా పడినట్లు ఢిల్లీ నుంచి సమాచారం అందిందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ సారధ్య బాధ్యతలు చేపట్టాక రాహుల్‌గాంధీ జీసీసీ దేశాల్లో తొలిసారిగా పర్యటించాల్సి ఉంది. రాహుల్‌ పర్యటనకు సంబంధించి ఎఐసిసికి సంబంధించి కొందరు ప్రముఖులు యూఏఈ వచ్చి ఏర్పాట్లను కూడా పర్యవేక్షించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com