సినీ నటుడు కారు బోల్తా... స్వల్ప గాయాలు.. అపోలోకి తరలింపు
- December 24, 2017
వరస ప్రమాదాలు.. వరస విషాదాలు సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. హైదరాబాద్ నవాబ్స్ మూవీ ఫేమ్ ఆర్కే ప్రయాణిస్తున్న కారు కి జరిగిన రోడ్డు ప్రమాదంలో నటుడు ఆర్కే కు స్వల్పగాయలు అయ్యాయి. ఆదివారం సాయంత్రంజూబ్లీ హిల్స్ రోడ్డు నెంబర్ 36 వైపుగా తన కారులో వెళ్తున్న ఆర్కే కారును.. పక్క నుంచి వేగంగా వచ్చిన మరో కారు ఢీ కొట్టింది. దీంతో ఆర్కే కారు బోల్తా పడింది.. వెంటనే స్పందించిన స్థానికులు ఆయన్ని కారు నుంచి బయటకు తీసి.. గాయాలు కావడంతో.. వెంటనే అపోలో కు తరలించారు. రోడ్డు మూల మలుపు వద్ద వేగంగా కారు నడపడం వల్ల అదుపు తప్పిన కారు.. ఆర్కే కారుని ఢీ కొట్టినట్లు ప్రత్యక్ష సాక్షుల కథనం... ప్రమాదానికి కారణమైన కారుని ఓ మహిళ నడిపింది అని తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తుచేస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల