కేంద్రం పేదలకు గృహ పథకానికి శ్రీకారం
- November 18, 2015
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పట్టణ ప్రాంతాల్లో పేదలకు గృహ పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందుకు కేంద్ర గృహ నిర్మాణ శాఖ ఆమోదం తెలిపింది. మొత్తం రెండు కోట్ల గృహాలు నిర్మించాలనే లక్ష్యంగా కొనసాగుతున్న ఈ పథకంలో తొలి దఫాలో 2 లక్షలకు పైగా ఇళ్లను నిర్మించాలని సంకల్పించింది. ఈ పథకంలో సింహభాగం గృహాల కేటాయింపు ఆంధ్రప్రదేశ్‌కే దక్కడం విశేషం. ఎట్టకేలకు ముందడుగు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అందరికీ గృహాలు ప్రాజెక్టులో ఎట్టకేలకు ముందడుగు పడింది. మొదటి విడతలో భాగంగా ఐదు రాష్ట్రాల్లోని పట్టణ పేదలకు 2లక్షల,28 వేల,204 ఇళ్లు నిర్మించేందుకు కేంద్ర గృహ, పట్టణ, పేదరిక నిర్మూలన మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఈ నిర్మాణాలకు కేంద్రం సాయంగా 3వేల 231 కోట్లు అందించనుంది. రాష్ట్ర ప్రభుత్వాలే స్థలం కేటాయించాలన్న కేంద్రం పరిమిత ఖర్చులో ఇళ్ల నిర్మాణ భాగస్వామ్యం, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద చేపట్టనున్న ఈ నిర్మాణ ప్రాజెక్టులకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే స్థలం కేటాయించాలని కేంద్రం స్పష్టం చేసింది. అందరికీ ఇళ్లు ప్రాజెక్టులో భాగంగా తెలంగాణలోని పది నగరాల్లో 10వేల 290 గృహాలు కేటాయించగా, ఆంధ్రప్రదేశ్‌కు 37 నగరాల్లో ఒకలక్షా 93 వేల 147 గృహాలను కేటాయించింది. కేంద్ర మంజూరు పర్యవేక్షక కమిటీ కేంద్ర గృహ, పట్టణ పేదరిక నిర్మూలన మంత్రిత్వ శాఖ కార్యదర్శి నందితా ఛటర్జీ అధ్యక్షతన ఢిల్లీలో బుధవారం ఒక సమావేశం జరిగింది. ఈ ప్రాజెక్టు కోసం ఆయా రాష్ట్రాలు పంపిన ప్రతిపాదనలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం మంత్రిత్వ శాఖలోని కేంద్ర మంజూరు పర్యవేక్షక కమిటీ తెలుగు రాష్ట్రాలతో పాటు గుజరాత్, రాజస్థాన్, తమిళనాడులలో మొత్తం 2లక్షల28వేల204 గృహాలు నిర్మించేందుకు ఆమోదం తెలిపింది. ఈ మొత్తం గృహాల్లో 2లక్షల17 వేల 748 గృహాలు ఆర్థికంగా బలహీన వర్గాలకు కేటాయించాలని నిర్ణయించింది. ఆర్థిక సాయంగా రూ.లక్షన్నర అత్యధికంగా గృహాలు ఆంధ్రప్రదేశ్ దక్కించుకోగా గుజరాత్ 15వేల580 గృహాలు, రాజస్థాన్ 6వేల 255 గృహాలు, తమిళనాడు 2వేల 932 గృహాలు దక్కించుకొని తరువాతి స్థానాల్లో నిలిచాయి. ప్రస్తుతం ఒక్కొక్క ఇంటి నిర్మాణానికి కేంద్రం తన వంతు ఆర్థిక సాయంగా లక్షన్నర రూపాయలను అందించనుంది. గృహాల ప్రాజెక్టుల నిర్మాణంలో గతంలో ఎదురైన అనుభవాలను పరిగణలోకి తీసుకొని ప్రస్తుత ప్రాజెక్టులకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే స్థలం కేటాయించాలని కేంద్రం స్పష్టం చేసింది. పట్టణ పేదలకు రెండు కోట్ల గృహాలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2022 వరకు పట్టణ పేదలకు రెండు కోట్ల గృహాలు నిర్మించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. గృహాల నమూనాను బట్టి ఒక్కో ఇంటికి లక్ష నుంచి 2లక్షల 33వేల వరకు కేంద్రం సాయం అందించనున్నట్లు తెలిపింది.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!







