యు.ఎ. ఈ. లో ఉద్యోగావకాశాలు తగ్గుతున్నా, నిపుణులకు పెరుగుతున్న డిమాండ్
- November 18, 2015
మోన్ స్టర్ ఎంప్లాయిమెంట్ ఇండెక్స్ (MEI) వారి తాజా గణాంకాల ప్రకారం, గల్ఫ్ ప్రాంతంలో ఆన్ లైన్ లో ప్రకటించ బడుతున్న ఉద్యోగాల పెరుగుదల రేటు - సెప్టెంబర్ 2015 లో 24 శాతం కాగా, అక్టోబరు 2015 లో 14 శాతం ఉంది. అంటే ఇంచుమించు 50 శాతం తక్కువగా ఉన్నా, కొన్ని రంగాలలో నిపుణులకు ముఖ్యంగా, యు.ఎ. ఈ. లో డిమాండు తగ్గలేదు సరికదా మరింత ఎక్కువయిందని తెలియవచ్చింది. మధ్య ప్రాచ్యంలో ఆన్ లైన్ జాబ్ పోస్టింగ్ ను నెలవారీగా అంచనా వేసే MEI యొక్క మేనేజింగ్ డైరక్టర్ (భారత్,మధ్య ప్రాచ్యం, ఆగ్నేయాసియ మరియు హాంగ్ కాంగ్) ఐన సంజయ్ మోడీ తెలియజేసిన సమాచారం ప్రకారం, త్రైపక్షిక మరియు అర్ధ వార్షిక అభివృద్ధి రేటు కూడా తక్కువగానే ఉంది. బ్యాంకులు మరియు ఆర్ధిక వ్యవహారాలు, ఐ. టి. మరియు టెలికం , విద్య, చమురు మరియు సహజ వాయు రంగాలు దిగాలుగా ఉండగా, హెచ్. అర్. మరియు పరిపాలనా, ఆరోగ్య రంగాలలో చక్కని పెరుగుదలను సూచిస్తున్నాయని, ఆయా రంగాలలో నిపుణులకు బ్రహ్మాండమైన డిమాండు ఉందని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!







