దుబాయ్ మెట్రో, ట్యాక్సీలకు వ్యాట్ లేదు
- December 26, 2017
జనవరి 1 నుంచి అమల్లోకి రానున్న వ్యాట్ నేపథ్యంలో, వివిధ విభాగాలకు సంబంధించి 'వ్యాట్'పై క్లారిటీ వస్తోంది. పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ - ఎగ్జిక్యూటివ్ రెగ్యులేషన్స్ ఆర్టికల్ 45 ప్రకారం వ్యాట్ నుంచి మినహాయింపు పొందాయి. ఈ నేపథ్యంలో దుబాయ్ మెట్రో, ట్యాక్సీలు వ్యాట్ నుంచి మినహాయింపు పొందబడినట్లు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసిఎఐ) వ్యాట్ ఫెసిలిటీ తరఫున దిలీప్ జైన్ వెల్లడించారు. మోటర్ వెహికిల్, ట్యాక్సీ, బస్, రైల్వే ట్రైన్, ట్రామ్, మోనో రైల్ వంటివి, ఫెర్రీ బోట్, అబ్రా వంటివి, హెలికాప్టర్, ఏరోప్లేన్ వంటివి ప్రయాణీకుల్ని తరలించేందుకోసం అనుమతి పొందబడినవైతే వాటికి వ్యాట్ నుంచి మినహాయింపు లభిస్తుంది. అయితే వీటిల్లో కేటరింగ్ సర్వీసులు వంటివి మాత్రం వ్యాట్ నుంచి మినహాయింపు పొందలేవు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







