ఏప్రిల్ 12న 'కృష్ణార్జునయుద్ధం' చేయనున్న మిడిల్ క్లాస్ అబ్బాయి
- December 28, 2017
'ఎవడే సుబ్రమణ్యం' నుండి రీసెంట్గా విడుదలైన 'ఎంసీఏ' వరకు ఎనిమిది వరుస సక్సెస్ఫుల్ చిత్రాలతో మెప్పిస్తున్న నేచరల్ స్టార్ నాని హీరోగా ద్విపాత్రాభినయంలో నటిస్తున్న చిత్రం 'కృష్ణార్జున యుద్ధం'. వెంకట్ బోయనపల్లి సమర్పణలో షైన్ స్క్రీన్న్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'వెంకటాద్రి ఎక్స్ప్రెస్', 'ఎక్స్ప్రెస్ రాజా' చిత్రాల దర్శకుడు మేర్లపాక దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోంది. అనుపమ పరమేశ్వరన్ మరియు రుఖ్సార్ మీర్ ఈ చిత్రం లో నాయికలు గా నటిస్తున్నారు. ఈ సినిమా రెండు షెడ్యూల్స్ చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతుంది. ఇందులో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్తో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ సహా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 12న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి హిప్ హాప్ తమిళ సంగీతాన్ని అందిస్తుండగా, కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
తాజా వార్తలు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..







