కోటి రూపాయల స్కాం నిందితుడు.. వాషింగ్ మెషీన్లో చిక్కాడు
- December 27, 2017
చేసిన పాపం చెబితే పోతుందంటారు. మరి ఇతగాడు బీఈడీ అడ్మిషన్లు ఇప్పిస్తానని విద్యార్థుల్ని మోసం చేసి కోటి రూపాయలు పోగేసుకుని ఎంచక్కా ఉడాయించాడు. 15 ఏళ్లుగా పోలీసులు ఇతడి కోసం గాలిస్తున్నా దొరక్కుండా పారిపోతున్నాడు. ముంబై జూహూ ప్రాంతానికి చెందిన మనోజ్ తివారీ 2002లో విద్యార్థులను ఎరగా చేసుకుని డబ్బు సంపాదించాలనుకున్నాడు. బీఈడీ సీట్లను ఆశగా చూపించాడు. పెద్ద మొత్తంలో వసూలు చేసి కోటి రూపాయలకు పైగా సంపాదించాడు. విద్యార్థులు జరిగిన మోసాన్ని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేయగా అతడిని అరెస్టు చేయడానికి పోలీసులు రంగం సిద్దం చేశారు.
అయితే గత 15 ఏళ్లుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సోమవారం జూహూ ప్రాంతంలో ఉన్న అతడి నివాసానికి చేరుకున్నారు. మూడు గంటల పాటు ఇంట్లో అతడి కోసం వెతికారు. ఎక్కడా కనిపించలేదు. అయితే వాషింగ్ మెషీన్ డోర్ దగ్గర కుప్పగా బట్టలు పడి ఉండడాన్ని గమనించారు. అనుమానం వచ్చి మెషీన్ డోర్ ఓపెన్ చేసి చూడగా అందులో మనోజ్ కనిపించాడు. భార్యే అతడిని అందులో దాచిందని తెలుసుకున్న పోలీసులు అవాక్కయి అతడిని అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపించారు.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







