రహదారి భద్రతా లక్ష్యాలను నెలకొల్పడం అవసరం : కతార్
- November 19, 2015
రహదారి భద్రతా విధానాలను రూపొందించేటప్పుడు, వానిని సక్రమంగా అమలుపరిచేలా ప్రభుత్వ కార్యాలయాలకు లక్ష్యాలను నిర్ణయించడం ముఖ్యమని, స్వీడన్ దేశ నిపుణులు - డా. ఆండ్రాస్ వర్హేలై సూచించారు. కతార్ లో 24 వ ఇంటర్నేషనల్ ట్రావెల్ మెడిసిన్ అసోసియేషన్ కాంగ్రెస్ యొక్క మూడవ మరియు ఆఖరి రోజున, 'రహదారి భద్రతా నిర్వహణ- క్రమబద్ధమైన విధానం ఆవశ్యకత' అనే అంశంపై ఆయన ముఖ్యోపన్యాసమిస్తూ -రోడ్ల భద్రత, మరియు వానిపై జరిగే ప్రమాదాలు మరియు దుర్ఘటనలను గురించి సమాచారం అందరికీ అందుబాటులో ఉంచడం ముఖ్యమని, ఆసుపత్రుల వారు మరియు పొలిసు వారు కూడా రికార్డులను సరిగా నిర్వహించాలని, తద్వారా ఆ సంఘటనలు జరగడానికి కారకులను కనుగోనవచ్చని, తద్వారా భద్రతా సరైన విధానాలను రూపొందిoచగలమని ఆయన వివరించారు. పరిమిత వేగాన్ని అమలుపరచడం, సురక్షితమైన రోడ్ల నిర్మాణం, సీట్ బెల్టులను వాడడం, అదేవిధంగా ప్రమాద ప్రదేశానికి 30 నిముషాలలోగా రక్షణా దళాలు చేరుకోనగాలిగేలా చేయగలగడం ద్వారా సురక్షతను అమలుపరచగలమని ఆయన ముగించారు.
తాజా వార్తలు
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు







