పర్యటకులకు తీపి కబురు తెలిపిన సౌదీ ప్రభుత్వం
- December 28, 2017
రియాద్: సౌదీఅరేబియా 2018 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్న విలువ ఆధారిత పన్ను (వ్యాట్) పర్యటకులకు భారం కానున్నదని భావిస్తున్న అక్కడి ప్రభుత్వం తిరిగి చెల్లించేలా సంస్కరణలు చేపట్టనుంది. విమాన టిక్కెట్లు కొనుగోలు సమయంలో పర్యటకులు చెల్లించిన వ్యాట్‌ను తిరిగి ఇచ్చేందుకు అవసరమైన ప్రతిపాదనలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఈ సమాచారాన్ని జనరల్ అథారిటీ ఆఫ్ జకాత్ అండ్ ట్యాక్స్ అధికారులు ఈ విషయాన్ని అక్టోబర్ నెలలోనే ప్రకటించారు. జనవరి 1 నుంచే వ్యాట్ అమల్లోకి రానున్నదని, కానీ పర్యటకులకు జనవరి 1 నుంచే తిరిగి చెల్లించడం కుదరదని తొలుత తెలిపారు. ఈ వెసులుబాటు కల్పించేందుకు అవసరమైన ప్రతిపాదనలు జరుగుతున్నాయని, ఓ స్పష్టత వచ్చిన తర్వాత పర్యటలకులకు వ్యాట్‌ను రిఫండ్ చేయనున్నామని అధికారులు పేర్కొన్నారు. ఇదిలావుండగా గల్ఫ్ దేశాలైన యూఏఈ, సౌదీఅరేబియాలో జనవరి 1 నుంచి 5 శాతం వ్యాట్ అమల్లోకి రానుంది. వివిధ వస్తువులు, సేవలపై ఈ భారం మోపనున్నారు .
తాజా వార్తలు
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!







