80 శాతం డిస్కౌంట్తో యూఏఈలో బిగ్గెస్ట్ సేల్
- December 30, 2017
2018 జనవరి 1 నుంచి వ్యాట్ అమల్లోకి రానున్న నేపథ్యంలో 'ప్రీ వ్యాట్' సేల్స్ ఊపందుకుంటున్నాయి. బిగ్గెస్ట్ వింటర్ క్లియరెన్స్ సేల్లో బాగంగా షార్జా ఎక్స్పో సెంటర్ వద్ద 'ఫెయిర్' నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 31తో ముగియనున్న ఈ ఫెయిర్లో, 80 శాతం వరకు డిస్కౌంట్తో ఆయా ఉత్పత్తులు అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లయెన్సెస్ వినియోగదారుల కోసం భారీ ఆఫర్లతో ఎదురుచూస్తున్నాయిక్కడ. జనవరి 1 నుంచి ఐదు శాతం 'లెవీ' ఆయా వస్తువులపై అదనంగా చెల్లించాల్సి ఉన్నందున, ఈ అద్భుతమైన ఆఫర్ని డిసెంబర్ 31లోపు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. ఐదు దిర్హామ్లు ఎంట్రీ ఫీజ్. 12 ఏళ్ళ లోపు చిన్నారులకు ఎంట్రీ ఫ్రీ.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







