ఫ్రెండ్స్‌ ఆఫ్‌ క్యాన్సర్‌ పేషెంట్స్‌కి 5 అవార్డులు

- December 30, 2017 , by Maagulf
ఫ్రెండ్స్‌ ఆఫ్‌ క్యాన్సర్‌ పేషెంట్స్‌కి 5 అవార్డులు

ఈ ఏడాది ఇప్పటిదాకా ఫ్రెండ్స్‌ ఆఫ్‌ క్యాన్సర్‌ పేషెంట్స్‌కి ఐదు ప్రతిష్టాత్మక అవార్డులు దక్కాయి. లాభాపేక్ష లేకుండా పనిచేస్తున్న ఫ్రెండ్స్‌ ఆఫ్‌ క్యాన్సర్‌ పేషెంట్స్‌ సంస్థ, క్యాన్సర్‌ బాధితులకు, బాధిత కుటుంబాలకు అండదండలందిస్తోంది. క్యాన్సర్‌ పట్ల అవగాహన కల్పించడం సహా, అనేక కార్యక్రమాల్ని ఈ సంస్థ నిర్వహిస్తోంది. బ్రెస్ట్‌ క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకోసం ఉచితంగా మెడికల్‌ చెకప్‌ క్యాంప్స్‌నీ నిర్వహిస్తూ అందరి మన్ననలు అందుకుంటోంది ఈ సంస్థ. యూఏఈ వ్యాప్తంగా పింక్‌ కారవాన్‌ పేరుతో బ్రెస్ట్‌ క్యాన్సర్‌ అవేర్‌నెస్‌ కాంపెయిన్‌ని నిర్వహించారు. ఫ్రెండ్స్‌ ఆఫ్‌ క్యాన్సర్‌ పేషెంట్స్‌ సంస్థలో ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారనీ, బాధితులకు అండగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారని బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ చైర్‌ పర్సన్‌ సాసాన్‌ జఫార్‌ చెప్పారు. గ్లోబల్‌ గివింగ్‌ అవార్డ్స్‌ని వరల్డ్‌ సస్టెయినబులిటీ కాంగ్రెస్‌ ద్వారా రెండుసార్లు అవార్డుల్ని అందుకుంది ఈ సంస్థ. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com