న్యూఇయర్ విషెస్ తో వాట్సప్ క్రాష్
- December 31, 2017
ప్రఖ్యాత మెసేజింగ్ సర్వీస్ యాప్ వాట్సప్ క్రాష్‌డౌన్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా కొద్దిపాటి కలకలంరేగింది. ఊహకు అందని రీతిలో న్యూఇయర్ విషెస్ వెల్లువత్తడంతో ఏర్పడిన సాంకేతిక సమస్యలే ఇందుకు కారణమని సంస్థ ప్రతినిధులు తెలిపారు. భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 12:10 గంటల నుంచి దాదాపు 2 గంటలపాటు వాట్సప్ నిలిచిపోయినట్లు ఫిర్యాదులు అందాయి.
తొలుత న్యూజిలాండ్‌లో వేడుకలు మొదలు.. వరుసగా ఆస్ట్రేలియా, జపాన్, చైనా, హాంకాంగ్, భారత్, శ్రీలంక, పాకిస్తాన్ అటుపై పశ్చిమదేశాలు కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాయి. ఆయా దేశాల్లో శుభాకాంక్షల మెసేజ్‌లు వెల్లువెత్తడంతో మెసేజింగ్ యాప్‌లో సమస్యలు తలెత్తాయి. దీంతో యూజర్లకు కలిగిన అంతరాయానికి క్షమాపణలు చెబుతూ వాట్సప్ ప్రతినిధులు ఒక ప్రకటన చేశారు. ప్రస్తుతానికి వాట్సప్ యధావిధిగా పనిచేస్తోంది.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







