చిరంజీవి కోసం గుండు కొట్టించుకొన్న బ్రహ్మాజీ..!!
- January 01, 2018
ఖైదీ నెంబర్ 150 తో రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి.. తాజా సినిమా 'సైరా'. భారీబడ్జెట్ తో.. భారీ తారాగణం తో ఈసినిమా రూపొందుతున్నది. మెగాస్టార్ సరసన నటించే అవకాశం వస్తే బాగుండును అని ఎంతోమంది నటులు కోరుకుంటారు.. అలా నటించే అవకాశం వస్తే.. అదృష్టం అని వెంటనే అంగీకరిస్తారు.. అలా చిరంజీవి సరసన నటించే అవకాశం బ్రహ్మాజీ కి లభించిందట.. సినిమాలో పాత్ర పతిధి మేరకు.. గుండుతో కనిపించాలని చెప్పినా.. బ్రహ్మాజీ వెంటనే ఒకే చెప్పి.. ఆ పాత్ర కోసం గుండు కొట్టించుకొన్నారట.. ఈ విషయం ఎలా వెలుగులోకి వచ్చిందంటే.. బ్రహ్మాజీ.. ప్రస్తుతం తలకు ఓ గుడ్డ చుట్టుకొని తిరుగుతున్నారట.. ఎందుకు బ్రహ్మాజీ ఇలా కనిపిస్తున్నారు అని ఆరాతీసిన వారికి అసలు సంగతి తెలిసిందట.. సైరా సినిమాలో ఓ విభిన్న పాత్ర కోసం బ్రహ్మాజీఇలా రెడీ అయ్యాడని చెబుతున్నారు.. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకొన్న సైరా.. సెకండ్ షెడ్యూల్ ను ఫిబ్రవరి మొదటి వీక్ లో జరుపుకొనున్నదట.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







