68 గ్యాస్ స్టేషన్ల సీజ్
- January 01, 2018
జెడ్డా: మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇన్వెస్టిమెంట్ (ఎంసిఐ), కింగ్డమ్లో మొత్తం 68 ఫ్యూల్ స్టేషన్స్‌ని సీజ్ చేసినట్లు వెల్లడించింది. ధరల పెరుగుదల నేపథ్యంలో ఆదివారం రాత్రి పెట్రోల్ అమ్మకాల్ని నిలిపివేసినందుకుగాను ఈ ఫ్యూయల్ స్టేషన్లను సీజ్ చేయడం జరిగిందని ఎంసిఐ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. 1,597 ఫ్యూయల్ స్టేషన్లను తనిఖీ చేసి, నిబంధనల్ని ఉల్లంఘించిన ఫ్యూయల్ స్టేషన్లపై చర్యలు తీసుకున్నారు. ఎప్పటికప్పుడు ఎంసిఐ తరఫున తనిఖీలు జరుగుతూనే ఉంటాయనీ, ధరల మోసాలకి పాల్పడినా, ట్యాంపరింగ్‌కి పాల్పడినా ఉపేక్షించేది లేదని ఎంసిఐ ఫ్యూయల్ స్టేషన్ల నిర్వాహకుల్ని హెచ్చరించింది. కొన్ని ఫ్యూయల్ స్టేషన్లను ముందస్తుగా మూసివేయడంతో మిగతా స్టేషన్లలో వాహనదారుల రద్దీ విపరీతంగా పెరిగింది. ధరల పెరుగుదల నేపథ్యంలో ఫ్యూయల్ స్టేషన్ల నిర్వాహకులు చూపిన అత్యుత్సాహం సీజ్ దాకా వెళ్ళింది, వాహనదారులకు ఇబ్బందులు తప్పలేదు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







