వ్యాట్‌ ఫ్రీ సాలిక్‌: కండిషన్స్‌ అప్లయ్‌

- January 01, 2018 , by Maagulf
వ్యాట్‌ ఫ్రీ సాలిక్‌: కండిషన్స్‌ అప్లయ్‌

సాలిక్‌ (టోల్‌గేట్‌) ఛార్జీలకు సంబంధించి వ్యాట్‌ ఫ్రీ వెసులుబాటు ఉంది. అయితే ఇది ఆన్‌లైన్‌ ద్వారా లేదంటే ఆర్‌టిఎ వెబ్‌సైట్‌ ద్వారా సాలిక్‌ అకౌంట్‌ని రీచార్జ్‌ చేసుకుంటేనే ఈ వ్యాట్‌ ఫ్రీ వర్తిస్తుంది. పెట్రోల్‌ స్టేషన్లలోనో, సూపర్‌ మార్కెట్స్‌లోనో రీఛార్జ్‌ చేసుకుంటే మాత్రం సాలిక్‌ ఛార్జీలపై వ్యాట్‌ ఐదు శాతం చెల్లించక తప్పనిసరి. టోల్‌గేట్స్‌ ద్వారా ప్రయాణించే వాహనాలకు 4 దిర్హామ్‌ల సాలిక్‌ ఛార్జీలు స్మార్ట్‌ ట్యాగ్‌ ద్వారా యధాతథంగా డిడక్ట్‌ అవుతాయి. అయితే ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ, పబ్లిక్‌ ట్రాన్స్‌పోర&్ట ఫెసిలిటీస్‌కి ఎలాంటి వ్యాట్‌ సాలిక్‌ ఛార్జీలపై వసూలు చేయడంలేదని ఇప్పటికే స్పష్టం చేసింది. దుబాయ్‌లో మొత్తం ఏడు సాలిక్‌ గేట్స్‌ ఉన్నాయి. పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సౌకర్యాలు (బస్‌లు, మెట్రో, ట్రామ్‌, మెరిటైమ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వంటివి) ఉపయోగించే ప్రయాణీకులు వ్యాట్‌ పరిధిలోకి రారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com