ఊచకోతకు పాల్పడ్డ ఆర్మీ మాజీ ఆఫీసర్
- January 02, 2018
పల్వాల్ : హర్యానాలో దారుణం జరిగింది. పల్వాల్లో ఆర్మీ మాజీ ఆఫీసర్ ఊచకోతకు పాల్పడ్డాడు. కేవలం రెండు గంటల వ్యవధిలోనే ఒక ఐరన్ రాడ్డుతో ఆరుగుర్ని కొట్టి చంపాడు. పల్వాల్లో ఈ హత్యాకాండ చోటుచేసుకున్నది. ప్రస్తుతం వ్యవసాయశాఖలో సబ్ డివిజనల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న 45 ఏళ్ల నరేశ్ కదియన్ ఈ హత్యలకు పాల్పడ్డాడు. మంగళవారం తెల్లవారుజామున ఉదయం 2 గంటల నుంచి 4 గంటల వరకు ఈ హత్యలు జరిగినట్లు తేల్చారు. నరేశ్ గత కొన్నాళ్లుగా మానసిక సమస్యతో బాధపడుతున్నట్లు తెలిసింది. భార్యా పిల్లలు ప్రస్తుతం నరేశ్‌కు దూరంగా ఉంటున్నారు. 2003లో ఆర్మీ లెఫ్టినెంట్ ఉద్యోగం నుంచి నరేశ్ వాలెంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడు. 2015లోనూ ఓ పోలీస్ కానిస్టేబుల్‌తో ఆయన గొడవకు దిగారు. ఇవాళ చనిపోయినవారిలో ఇద్దరు సెక్యూర్టీ గార్డులు, ఓ మహిళ ఉన్నట్లు గుర్తించారు.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







