గజల్ చుట్టూ బిగుస్తోన్న ఉచ్చు..
- January 02, 2018
లైంగిక వేధింపుల కేసులో గజల్ శ్రీనివాస్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ఏ-2గా ఉన్న పనిమనిషి పార్వతిని విచారణకు హాజరు కావాలని పిలిచారు. ఈ వ్యవహారంలో ఆమె పాత్ర ఎంత వరకు ఉందనే దానిపై ఆరా తీయనున్నారు. ప్రధానంగా బాధితురాలు పార్వతిపై ఆరోపణలు చేసింది. తనను గజల్ శ్రీనివాస్‌తో గడపాలని ఒత్తిడి చేసిందని చెప్పింది. దీనిపైనా ఆమెను ప్రశ్నించనున్నారు. అలాగే ఆలయ వాణి మాజీ ఉద్యోగుల్ని కూడా విచారణకు హాజరు కావాలని పిలిచినట్లు తెలుస్తోంది. ఇటు గజల్ బెయిల్ పిటిషన్, పోలీసు కస్టడీ పిటిషన్లు నేడు విచారణకు రానున్నాయి. ఈ కేసులో ఏ-1గా ఉన్న గజల్‌ను ప్రశ్నిస్తే మరిన్ని వాస్తవాలు బయటపడతాయంటున్నారు పోలీసులు. అందుకే అతడ్ని కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ వేశారు. ఇంకా బాధితులెవరైనా ఉంటే ధైర్యంగా తమకు ఫిర్యాదు చేయొచ్చంటున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







