ఏ టీ ఎం విత్ డ్రాలలో విలువ ఆధారిత ( వేట్ ) పన్నులేదు
- January 02, 2018
రియాద్:ఏదైనా సంస్కరణ దేశంలో మొదలైతే ...గోరంతలు...కొండంతలు చేసి అనేక అనుమానాలు ..పలు సందేహాలు మిళితం చేసి వెనువెంటనే కొందరు అసత్య ప్రచారం సోషల్ మీడియాలో మొదలుపెట్టడం ఇటీవల అధికమయ్యింది. ఏ టీ ఎం విత్ డ్రాలలో సంబంధించి ఎలాంటి విలువ ఆధారిత పన్ను (వాట్) చార్జ్ చేయబడదని సమాచార కమిటీ సెక్రటరీ జనరల్ ,సౌదీ బ్యాంకుల అవగాహన అధికార ప్రతినిధి టాలాట్ హాఫిజ్ హాఫిజ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఒక నిర్దిష్ట బ్యాంక్ యొక్కవినియోగదారుడు మరో బ్యాంకు యొక్క ఏ టీ ఎం నుండి డబ్బును ఉపసంహరించుకుంటే విలువ ఆధారిత పన్ను (వేట్) వసూలు చేయబడుతుందనే పుకార్లు సామాజిక మీడియాలో విస్తృతంగా ప్రాచుర్యం కావడాన్ని ఆయన ఖండించారు. కస్టమర్ యొక్క బ్యాంకు లేదా ఏ ఇతర బ్యాంక్ యొక్క ఏ టీ ఎంల నుండి ఉపసంహరణలపై ఏ విధమైన వేట్ ఉండదని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.సోషల్ మీడియా ద్వారా ఏదైనా అసత్య సమాచారాన్ని పంచుకోవడం లేదా వేరే ఇతరులకు పంపిణి చేయడం పట్ల ప్రముఖ న్యాయ నిపుణుడు ఇబ్రహీం జామ్జామి ప్రజలను హెచ్చరించారు. అటువంటి పోస్టులను పంచుకునేందుకు లేదా వేరేవారికి పంపించే వ్యక్తి పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఎదుట హాజరుకావాల్సిన బాధ్యత వహిస్తానని ఆయన చెప్పారు. కింగ్డమ్ లో సైబర్ చట్టాలు తెలిసే లేదా తెలియకుండా తప్పుడు సమాచారంను కొందరు ప్రజలు వెర్రిగా వ్యాప్తి లేదా ఆ తప్పుడు సమాచారంలో భాగస్వామ్యంలో పాత్ర ఉంటే అటువంటి వారు శిక్షార్హులవుతారు.
తాజా వార్తలు
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు