హైదరాబాద్‌లో మరోసారి చెడ్డీ గ్యాంగ్ హల్చల్
- January 03, 2018
హైదరాబాద్ లో మరోసారి చెడ్డీ గ్యాంగ్ హల్చల్ చేసింది. మల్కాజ్ గిరి గౌతమ్ నగర్ లో ఈ గ్యాంగ్ దొంగతనం చేయడానికి ప్రయత్నించిన దృశ్యాలు సీసీ కెమెరాకు చిక్కాయి. కమ్యూనిటీ భవనం రోడ్ లో ఉన్న డాక్టర్ రామ్మోహన్ ఇంటి పరిసరాల్లో చెడ్డీ గ్యాంగ్ దొంగతనాలకు విఫలయత్నం చేసింది. ఇళ్ల తలపులు తెరుచుకోకపోవడంతో గ్యాంగ్ వెనుదిరిగింది. గతంలో ఘట్ కేసర్, పటాన్ చెరు ప్రాంతాల్లో చోరీకి ప్రయత్నించిన చెడ్డీ గ్యాంగ్ తమ ప్రాంతంలో సంచరించడంతో మల్కాజ్ గిరివాసులు వణికిపోతున్నారు.
హైదరాబాద్‌ను గడగడలాడిస్తున్న చెడ్డీగ్యాంగ్.. గతంలో రాజమహేంద్రవరంలోనూ వణుకు పుట్టించింది. వరుస దొంగతనాలతో హడలగొట్టింది. ప్రగతి మార్గ్‌లోని సాయి అపార్ట్మెంట్లో చోరీకి పాల్పడింది ఈ దొంగల ముఠా. నాలుగో అంతస్థులో రెండు ఫ్లాట్లను లూటీ చేసింది. తాళాలు పగలగొట్టి ఇంట్లోనీ నగలు, నగదు ఎత్తుకెళ్లారు. మొదట ఇది మామూలు దొంగల పనేననుకున్నారు పోలీసులు. సీసీ కెమెరా ఫూటేజ్ పరిశీలించాకే తెలిసింది చడ్డీ గ్యాంగ్ పనని.
చెడ్డీ గ్యాంగ్ దొంగతనాలకు పక్కాగా ప్లాన్ చేస్తుంది. గ్యాంగ్ సభ్యులు పగలంతా బిచ్చగాళ్లలా తిరుగుతూ రెక్కీ నిర్వహిస్తారు. తాళం వేసి ఉన్న ఖరీదైన ఇళ్లను గుర్తిస్తారు. రాత్రికి రంగంలోకి దిగుతారు. బనియన్, చెడ్డీ ధరించి మారణాయుధాలతో వస్తారు. ఒళ్లంతా ఆయిల్ పూసుకుంటారు. చిటికెలో తాళాలు పగలగొట్టేస్తారు. చడీచప్పుడు కాకుండా ఇళ్లు గుల్ల చేస్తారు. అడ్డొస్తే దారుణంగా హతమారుస్తారు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







