బ్రిటన్‌ను వణికిస్తున్న ఎలీనార్ తుపాను
- January 03, 2018
స్కాట్లండ్: వేల్స్, ఇంగ్లాండ్, ఉత్తర ఐర్లండ్, దక్షిణ స్కాట్లండ్‌లోని కొన్ని ప్రాంతాలలో కొనసాగుతున్న ఎలీనార్ తుపాను ఆ ప్రాంతాలలో తీవ్ర విధ్వంసం సృష్టించింది. గంటకు దాదాపు 100 మైళ్ల వేగంతో వీచిన గాలుల ధాటికి విద్యుత్ వ్యవస్థ కుప్పకూలిపోవటంతో అనేక ఇళ్లు, భవనాలు చీకట్లో మగ్గుతున్నాయి. వేల్స్‌లోని గ్లామర్గాన్‌లో ఒక కారుపై చెట్టు కూలిన ఘటనలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. రైళ్లు, బస్సులతో పాటు ప్రతికూల వాతావరణం కారణంగా విమానాల రాకపోకల్లో సైతం తీవ్రమైన జాప్యం కొనసాగుతోంది. ఉత్తర ఐర్లండ్‌లో దాదాపు 3 వేల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని అధికారులు చెప్పారు. ఇంగ్లండ్‌లో 2,700 ఇళ్లకు, వేల్స్‌లో 460 ఇళ్లకు కూడా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







