కువైట్ లో 2018 ప్రారంభ గంటల్లో జన్మించిన పాతికమంది పిల్లలు

- January 03, 2018 , by Maagulf
కువైట్ లో  2018 ప్రారంభ గంటల్లో జన్మించిన పాతికమంది పిల్లలు

కువైట్: కొత్త ఏడాది కువైట్ ప్రభుత్వ ఆసుపత్రులలో 2018 ప్రారంభ గంటలలో 25 మంది బాల అతిధులు ఈ గల్ఫ్ దేశంలో అడుగుపెట్టారు. నూతన సంవత్సరం ఆలా మొదలై  మొదలవగానే అర్ధరాత్రి 12:21 సమయంలో ఓ చిన్నారి పాప కువైట్ లోనికి వచ్చినట్లు కేర్ మని గొంతు విప్పింది. ఆ తర్వాత 15 మంది బాలికలు మరియు తొమ్మిది మంది అబ్బాయిలతో పాటు, ఇద్దరు కవలలు కువైట్ మరియు ఈజిప్టులలో జన్మించారు. ఇక ఫార్వానియ ఆసుపత్రిలో అత్యధిక సంఖ్యలో నవజాత శిశువులు నమోదు చేయబడ్డారు. ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ మహ్దీ అల్-ఫధ్లీ ఎనిమిదిమంది  కొత్త శిశువులకు స్వాగతం పలికారు. ఇద్దరు కవల బాలికలు. సబాహ్  ఆసుపత్రి, ప్రసూతి శాస్త్రం మరియు గైనకాలజీ విభాగం అధిపతి డాక్టర్ వలీద్ అల్-జస్సార్ ఆసుపత్రిలో ఏడుగురు  శిశువులను నమోదు చేసుకున్నాడని - నల్గురు బాలురు  మరియు ముగ్గురు బాలికలు , ఇద్దరు కవలలు జన్మించినట్లు తెలిపారు. అలాగే .జహ్రా హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ అలీ అల్-ముత్తైరీ ఆసుపత్రిలో ఐదుగురు శిశువులు  జన్మించారు. నలుగురు బాలికలు,ఒక  బాలుడు జన్మించారు.. అదాన్ హాస్పిటల్ డాక్టర్   జస్సమ్ అల్ హజ్జీలోని ప్రసూతి మరియు గైనకాలజీ విభాగానికి చెందిన ఆసుపత్రిలో ఆసుపత్రిలో ఐదుగురు శిశువులు పుట్టినట్లు నమోదు కాబడింది. వీరిలో ముగ్గురు బాలుడు  మరియు ఇద్దరు బాలికలు ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com