'రంగులరాట్నం' ట్రైలర్‌ విడుదల

- January 03, 2018 , by Maagulf
'రంగులరాట్నం' ట్రైలర్‌ విడుదల

'రంగులరాట్నం' ట్రైలర్‌ విడుదల
'ప్రేమ పేరుతో నువ్వు పెట్టే ఈ టార్చర్‌ నేను భరించలేను'


హైదరాబాద్‌: 'ప్రేమ పేరుతో నువ్వు పెట్టే ఈ టార్చర్‌ నేను భరించలేను' అంటూనే తన ప్రేయసి చుట్టూ తిరుగుతున్నారు రాజ్‌తరుణ్‌. ఆమె కోసం తనకు ఇష్టం లేని పనులు చేస్తూ, ఇష్టమైన పనులకు దూరంగా ఉంటూ అనేక కష్టాలు పడుతున్నారు.

రాజ్‌తరుణ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం 'రంగులరాట్నం'. చిత్రా శుక్లా కథానాయిక. శ్రీరంజని దర్శకత్వం వహించారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ సంస్థ నిర్మించింది. ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర బృందం బుధవారం విడుదల చేసింది. ఇందులో రాజ్‌తరుణ్‌ ప్రేమ కష్టాలను చూపించారు.

భావోద్వేగాలతోపాటు వినోదం కలగలిపి రూపొందించిన ఈ ట్రైలర్‌ ఆసక్తికరంగా ఉంది.

ఈ చిత్ర నిర్మాత నాగార్జున ట్విటర్‌ వేదికగా ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. జీవితం 'రంగులరాట్నం'లా గుండ్రంగా తిరుగుతుందని ట్వీట్‌ చేశారు. 'ఉయ్యాల జంపాల' తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై రాజ్‌తరుణ్‌ హీరోగా తెరకెక్కిన చిత్రమిది.

సంక్రాంతికి సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com