ఒమన్‌లో విహరిస్తున్న ప్రిన్స్
- January 03, 2018
అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు కుటుంబం విహారయాత్ర కోసం ఒమన్‌కు వెళ్లింది. అక్కడ మహేశ్, ఆయన కుమారుడు గౌతమ్ పారాగ్లైడింగ్ చేశారు. గాల్లో విహరించారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలను నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
'నా సూపర్ హీరోలు.. పారాగ్లైడర్స్. తండ్రిలాగే కుమారుడు. అందమైన ఒమన్' అని రాశారు. ఇదే ట్రిప్‌లో తీసిన కొన్ని ఫొటోలను ఆమె గత కొన్ని రోజులుగా సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు. ఆమె షేర్ చేయని మహేశ్ మరో ఫొటో ప్రస్తుతం ఆన్‌లై న్లో చక్కర్లు కొడుతోంది. ఇందులో ఆయన ఎంతో ఉత్సాహంగా కనిపించారు.
'స్పైడర్' తర్వాత మహేశ్ 'భరత్ అనే నేను' సినిమాలో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటి కైరా అడ్వాణీ కథానాయిక పాత్ర పోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది.
దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇందులో మహేశ్ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనున్నారు. ఏప్రిల్ 27న ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల