నూతన సంవత్సర వేడుకలలో 650 మంది అరెస్టు

- January 03, 2018 , by Maagulf
నూతన సంవత్సర వేడుకలలో 650 మంది అరెస్టు

కువైట్: కొందరు ప్రబుద్ధులకు కొత్త ఏడాది కట కటాల వెనుక జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.  కువైట్ అధికారులు జనవరి ఒకటవ తేదీన  కనీసం 650 మంది నేరస్థులను అరెస్టు చేసి హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు. కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ మంగళవారం ఈ సమాచారం తెలిపారు. నూతన ఏడాదిని పురస్కరించుకొని సెలవుల సందర్భంగా కొందరు తాగిన మద్యం తలకెక్కి తిక్కవేషాలు వేసిన 118 మందిని అదుపులో తీసుకోగా, మరో 90 మంది అక్రమ నివాసితులు పట్టుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఎటువంటి గుర్తింపు పత్రాలు లేని మరో 378 మందిని అరెస్ట్ చేసినట్లు వివరించారు.   గైరుహాజరు కాబడిన 54 మందిని పట్టుకొన్నారు. నూతన సంవత్సర సెలవుల కాలంలో పోలీసులు 2,501 ఫోన్ కాల్స్ అందుకున్నారని, 1,363 మందిపై  ట్రాఫిక్ ఉల్లంఘనలను నమోదు చేశారని తెలిపారు. సెలవుదినం సందర్భంగా మానవతావాద కారణాలతో అత్యధికులను విడుదల చేయగా, రెచ్చిపోయిన మందిపై 1,075 కేసులు నమోదయ్యాయని ప్రకటన వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com