దుబాయ్: U16s క్రికెట్ టోర్నమెంట్ లో తెలంగాణ తేజం

- January 03, 2018 , by Maagulf

బహ్రెయిన్:దుబాయ్ లో జరగనున్న U16s క్రికెట్ టోర్నమెంట్ లో మన తెలంగాణ  తేజం.CH.తుషార్ కమల్ (గల్ఫ్ జాగృతి అధ్యక్షులు CH.హరిప్రసాద్ కుమారుడు)

ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని....నిలపరా నీ జాతి నిండు గౌరవాన్ని అన్నట్లు మన తెలుగు తేజం దూసుకు వెళ్లాడు. 

ఈ నెల దుబాయ్(షార్జా)లో asian cricket council U16s వెస్ట్రన్ రీజియన్ టోర్నమెంట్ 7 వ తేదీ నుండి 12 వ తేదీ వరకు జరగ నున్నాయి. ఈ క్రికెట్ టీం లో తుషార్ చెల్లమ్ శెట్టి సెలెక్ట్ అయ్యారు ఎంతో కష్టపడి చదువుల్లో ఎప్పుడు ముందు ఉండే యువకెరటం ఆటల్లో కూడా దూసుకెళ్లి టీం లో స్థానం సంపాదించారు. తన ఆనందాన్ని మాగల్ఫ్ తో తుషార్ పంచుకున్నారు.

నాకు మా తల్లిదండ్రులు ప్రోత్సాహం ఎప్పుడూ ఉంది అందుకే అత్యున్నత శిఖరాలను అధిరోహించి ముందుకు వెళ్తున్నాను అని చెప్పాడు.బహ్రెయిన్ ఒలింపిక్ అధ్యక్షులు Highness shaik Nasser Bin Hamad al khalifa అభినందించారు. తల్లిదండ్రుల ని కూడా అభినందించారు. అలాగే భవిష్యత్ లో గల్ఫ్ లో మంచి క్రీడాకారులు ను తయారు చేయాలని మేము చూస్తున్నాం అని చెప్పారు. ఈ టోర్నమెంట్ లో సౌదీ,కువైట్,బహ్రెయిన్,దుబాయ్, ఇరాన్ దేశాలు పాల్గొంటున్నాయి.ఫైనల్ మ్యాచ్ షార్ఝా క్రికెట్ స్టేడియం లో జనవరి12 వ తేదీన జరగనుంది. శ్రీ ch హరిప్రసాద్ మాట్లాడుతూ నాకు ఎంతో గర్వకారణంగా ఉంది పిల్లలు ను ఆటా పాటల్లో ఎప్పుడూ ప్రోత్సహహించాలి అని చెప్పారు.అప్పుడే జీవిత లక్ష్యాలు సాధిస్తారు అని అన్నారు. 
దేశ విదేశాల్లో తెలుగు తేజం విస్తరించాలని తెనలూరే తెలుగు ఇంటింటా ప్రవహించాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తున్నాను.

     
                  --వాసుదేవ రావు గల్ఫ్ జర్నలిస్ట్

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com